-
-
By Chowdary
Updated :
20 November 2025 06:18 PM
ఒకప్పుడు ఆఫీసుకు వెళ్లేందుకు హుందాగా ఉండే దుస్తుల్ని ఎంచుకుంటే సరిపోతుంది అనుకునేవారు. కానీ, ఇప్పుడు రోజంతా వెంట ఉంచుకోవాల్సిన ల్యాప్‌టాప్, ఫైల్స్, వాటర్‌బాటిల్, ఛార్జర్, మేకప్ సామగ్రి... వంటివి పెట్టుకునేందుకు ఓ మంచి హ్యాండ్‌బ్యాగ్ కూడా ఉండాలంటున్నారు. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలానే కాదు... స్టైల్‌గానూ కనిపించాలని కోరుకుంటున్నారు.
టోటే బ్యాగ్: ఓపెన్‌టాప్ డిజైన్, రెండు హ్యాండిల్స్, పెద్ద కంపార్ట్మెంట్లతో రోజువారీ అవసరాలకు సరిపోతుంది. ముఖ్యంగా ల్యాప్‌టాప్, నోట్‌బుక్, లంచ్‌బాక్స్ వంటివన్నీ ఇందులో చక్కగా అమరిపోతాయి. బ్లాక్, టాన్ కలర్లో లెదర్టోటేని ఎంచుకుంటే అది మిమ్మల్ని హుందాగా కనిపించేలా చేస్తుంది.
స్ట్రక్చర్డ్ షోల్డర్ బ్యాగ్: స్ట్రాంగ్ షేప్, సింగిల్ షోల్డర్ స్ట్రాప్, జిప్ లేదా మ్యాగ్నెటిక్ క్లోజర్- ఇవి స్ట్రక్చర్డ్ బ్యాగ్ లక్షణాలు. వేసుకుంటే మరీ భారీగా కనిపించకుండా ప్రొఫెషనల్ లుక్‌ని ఇస్తుంది. మీటింగ్స్, క్లయింట్ విజిట్స్‌కి వెళ్లేటప్పుడు దీన్ని వాడొచ్చు.
సాచెల్ బ్యాగ్... టాప్ హ్యాండిల్డ్, అడ్జెస్టబుల్ స్ట్రాప్, ఫ్లాప్ క్లోజర్‌తో... దీన్ని వాడేవారిని ట్రెండీగా కనిపించేలా చేస్తుంది. పైగా వీటిని చేత్తోనే పట్టుకోనక్కర్లేదు. భుజం మీద వేసుకునీ తీసుకెళ్లొచ్చు. ఈ బ్యాగుల్లో ఎక్కువగా మినిమలిస్ట్ డిజైన్స్ దొరకడం వల్ల జెన్జీలూ తెగ మెచ్చేస్తున్నారు.