-
-
By Chowdary
Updated :
20 November 2025 06:13 PM
కొన్ని చిట్కాలు... పెద్ద సమస్యలకు కూడా చిటికెలో పరిష్కారం చూపిస్తాయి. అలాంటివాటిల్లో ఇవి కొన్ని...
పార్టీకి వెళ్లే చివరి నిమిషంలో గోళ్లకు రంగు వేసుకోవాలన్న విషయం గుర్తొస్తుంది. అప్పుడే వేస్తే త్వరగా దుస్తులకు అంటుకుంటుంది. అసంపూర్తిగా చెరిగి గోళ్ల అందాన్నీ దెబ్బతీయొచ్చు. అలాకాకుండా ఉండాలంటే... ఓ గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసి అందులో వేళ్లను పెడితే సరి.
కొత్త చెప్పుల్ని కొన్న వెంటనే వేసుకుంటే కరుస్తాయి. వేళ్లు, మడమల దగ్గర బొబ్బలూ వస్తాయి. ఇలా కాకుండా... అక్కడ డియోడరెంట్ స్టిక్‌తో రుద్దితే లూబ్రికెంట్‌లా పనిచేస్తుంది. గ్లిజరిన్ కూడా వాడొచ్చు. ఇవి గాయాలు కాకుండా చూస్తాయి.
అర్జంటుగా ఫంక్షన్‌కి వెళ్లాలి... చీరకి అక్కడక్కడా ముడతలు కనిపిస్తున్నాయి. అలాగని ఐరన్ చేసే సమయం లేదు అనుకుంటే... హెయిర్ స్ట్రెయిటనర్ వాడి చూడండి. కుచ్చిళ్లు బాగా వస్తాయి.
చీర మీద బ్లవుజు కాస్త వదులుగా ఉందనుకుంటే ట్రాన్స్పరెంట్ డబుల్‌సైడ్ టేప్‌ని అతికించండి. సౌకర్యంగా ఉంటుంది. జ్యుయెలరీ కదలకుండానూ దీన్ని వాడొచ్చు.
డ్రెస్సుకున్న షో బటన్ ఊడి పడిపోయేలా ఉంది. గట్టిగా కుట్టేద్దామనుకుంటే సూదీదారం అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు పారదర్శకంగా ఉండే నెయిల్‌పాలిష్‌ని దారంపై వేస్తే.. ఆ బటన్ ఊడిపడిపోకుండా ఉంటుంది.