-
-
By Chowdary
Updated :
20 November 2025 06:08 PM
‘బాక్సులో కొంచెమే అన్నం పెట్టు’... ‘నేను నా ఫ్రెండ్ కంటే కేజీ ఎక్కువ బరువున్నా. ఈరోజు నుంచి నేను రాత్రి తినడం మానేస్తా’...
సన్నబడటం, బరువు తగ్గడం ఏది చేయాలన్నా అమ్మాయిలు దృష్టిపెట్టేది చాలావరకూ డైట్ మీదే! తీరా అనుకున్నది సాధించాక హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. ఆరోగ్యమంటే బరువు తగ్గడమేనా? అంటే కాదనే చెబుతున్నారు నిపుణులు. కేవలం సన్నగా, నిర్ణీత బరువులో ఉన్నంత మాత్రాన కలకాలం ఆరోగ్యంగా ఉంటామనీ అనుకోవద్దు అంటున్నారు. పోషకాహారం తీసుకుంటూ రోజూ వ్యాయామం చేస్తూ దృఢంగా ఉంటేనే ఆరోగ్యమంటున్నారు. ఇలా చేస్తూ ఎక్కువ బరువున్నా కూడా దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చట. సన్నగా 50 కేజీల్లోపు ఉండీ... డైట్లు చేస్తూ వ్యాయామాన్ని పక్కన పెట్టి గుండెజబ్బులు సహా ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నవారూ ఎక్కువే. పరిశోధనలు చెబుతున్న మాట ఇది. అంటే బరువు కాదు ఫిట్నెస్ ముఖ్యమన్న మాటేగా! కాబట్టి, అమ్మాయిలూ... క్రాష్ డైట్ల మీద దృష్టిపెట్టొద్దు. కనీసం అరగంట వ్యాయామానికి కేటాయిస్తూ శరీరం దృఢంగా ఉండేలా చూసుకోండి. అప్పుడే పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉంటారు... సరేనా?