-
-
By Chowdary
Updated :
20 November 2025 06:05 PM
‘బరువు తగ్గాలి.. నాజూగ్గా మారాలి..’ ప్రస్తుతం చాలామంది జపిస్తోన్న ఫిట్నెస్ మంత్రమిది. అందుకోసమే చక్కటి ఆహారం తీసుకుంటూనే.. కఠినమైన వ్యాయామాలు చేయడానికీ వెనకాడట్లేదు ఈ తరం అమ్మాయిలు. అయితే ఇలా ఎంత ప్రయత్నించినా ఈ చలికాలంలో మాత్రం బరువు తగ్గడం కాస్త కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్లో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది. తద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి చాలా సమయం పడుతుంది. అలాగని బరువు తగ్గలేమేమో అని నీరసపడిపోకుండా.. జీవక్రియల పనితీరును ప్రేరేపించే ఆహారం తీసుకోమంటున్నారు నిపుణులు. ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుందంటున్నారు. ఇందుకు మన వంటింట్లో ఉండే పదార్థాలకు మించిన పరమౌషధాలు లేదంటున్నారు. మరి, ఈ శీతాకాలంలో శరీరంలోని జీవక్రియల పనితీరును మెరుగుపరిచి బరువు తగ్గేందుకు సహకరించే ఆ పదార్థాలేవి? వాటితో బరువు తగ్గడం ఎలా సాధ్యమవుతుంది? రండి.. తెలుసుకుందాం..!
⚛ పసుపులో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. అందుకే రోజూ పసుపును వంటకాల్లో భాగం చేసుకోవడంతో పాటు పసుపుతో తయారుచేసిన టీ, డీటాక్స్ వాటర్ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
⚛ చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించే గుణాలు దాల్చిన చెక్కలో బోలెడున్నాయి. ఇది జీవక్రియల పనితీరును వేగవంతం చేసి పదే పదే ఆకలేయడాన్ని నియంత్రిస్తుంది. తద్వారా ఏది పడితే అది తినకుండా జాగ్రత్తపడచ్చు. ఫలితంగా బరువూ తగ్గచ్చు. ఇందుకోసం ఉదయాన్నే పాలల్లో టేబుల్‌స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకొని కలిపి తీసుకోవచ్చు.