-
-
By Chowdary
Updated :
26 November 2025 11:26 AM
కావలసినవి: మాంసం ముక్కలు - అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్ల చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, కశ్మీరీ కారం - టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి - స్పూన్, గరం మసాలా - పావు స్పూన్, కసూరీ మేథీ పౌడర్ - 2 స్పూన్లు, నూనె - 4 టేబుల్ స్పూన్లు
మ్యారినేట్ చేయడానికి: ఉప్పు - తగినంత, పసుపు - పావు స్పూన్, కారం - 2 స్పూన్లు, పెరుగు - 100 గ్రాములు
గ్రేవీ కోసం: సోంపు - స్పూన్, నల్ల యాలకులు - 2, ఆకుపచ్చ యాలకులు - 4, లవంగాలు - 5, దాల్చినచెక్క - అంగుళం ముక్క, మిరియాలు - 10, టొమాటో, ఉల్లి తరుగు - అర కప్పు చొప్పున, నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
తయారీ: గిలకొట్టిన పెరుగులో మాంసం ముక్కలు, కారం ఉప్పు, పసుపు వేసి కలిపి ఒక గంట నాననివ్వాలి. ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి.. దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు, లవంగాలు, సోంపు ఒక్కొక్కటిగా వేసి.. అవి వేగాక ఉల్లి తరుగు వేయాలి. అది లేత గోధుమ రంగులోకి మారాక టొమాటో ముక్కలు జతచేసి వేయించాలి. మెత్తగా అయ్యాక దించేయాలి. చల్లారాక గ్రైండ్ చేసి పక్కనుంచాలి. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడయ్యాక.. అల్లం వెల్లుల్లి పేస్టును వేయించి.. గ్రైండ్ చేసిన మిశ్రమం జోడించాలి. అది కాస్త వేగాక.. మ్యారినేట్ చేసిన మాంసం ముక్కలు కూడా వేసి కలియతిప్పుతుండాలి. నాలుగు నిమిషాలయ్యాక పావు లీటర్ నీళ్లు, కశ్మీరీ కారం, ధనియాలు, జీలకర్ర పొడులు, గరం మసాలా, కసూరీ మేథీ, ఉప్పు వేసి కలియబెట్టాలి. మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికిస్తే స్పైసీ పంజాబీ మటన్ కర్రీ తయారైపోతుంది.