-
-
By Chowdary
Updated :
14 November 2025 11:28 AM
రాజమహేద్రవరం , నవంబరు 13: పేద మధ్యతరగతి కుటుంబాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో వెలుగులు నింపుతోందని రాజమహేద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 14 మంది లబ్ధిదారులకు రూ.12,65,349లు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ “ఎన్టీఆర్ వైద్య సేవలో లేని అనేక చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పుల బారిన పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆశాకిరణంగా మారింది. రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల వరకు వైద్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది” అని తెలిపారు. గత 17 నెలల కాలంలో రూరల్ నియోజక వర్గం పరిధిలో రూ. 2,69,42,532లు సీఎం సహాయ నిధి కింద సహాయం అందజేశామని గోరంట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర కుమ్మరి శాలివాహన డైరెక్టర్ పండూరి అప్పారావు, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, కురుకూరి కిషోర్, బొప్పన నానాజీ, పెండ్యాల రామకృష్ణ, పితాని శివరామకృష్ణ, వట్టికూటి దత్తుడు, పాఠంశెట్టి రాంజీ, దండమూడి తేజ, తాడేపల్లి నాగరాజు, దొడ్డి బాబ్జి, చలమూరి సత్యనారాయణ, సింగవరపు సత్యనారాయణ, కొప్పిశెట్టి చిన్ని, గారపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.