-
-
By Chowdary
Updated :
22 December 2025 12:11 PM
అచ్చుతాపురం, మనసులో మాట డిసెంబర్ 22: మండలంలోని మోసయ్యపేట గ్రామం చెత్తకుప్పలు, మురుగు నీటితో దుర్భర పరిస్థితుల్లో కూరుకుపోయింది. ముఖ్యంగా రామాలయం వీధిలో డ్రైనేజీ పూర్తిగా మూసుకుపోవడంతో మురుగు నీరు ఇళ్లల్లోకి చేరుతుంది
గ్రామంలోని చెరువుల్లో అక్రమ నిర్మాణాల వల్ల నీటి ప్రవాహ మార్గాలు అడ్డుకుపోయి, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా మురుగు నీరు ఇళ్లలోకి చేరుతూ, పురుగులు, పాములు వంటి జీవులు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దోమల విపరీత పెరుగుదలతో పిల్లలు, వృద్ధులు తీవ్రంగా దోమకాటుకు గురవుతున్నారు. దీని వల్ల , జ్వరాలు తదితర అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రజలు
భయాందోళన గురవుతున్నారు
సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో “ఇక్కడ నివసించాలా? ఇళ్లను ఖాళీ చేయాలా?” అనే స్థితికి మోసయ్యపేట ప్రజలు చేరుకున్నారు. తక్షణమే పారిశుధ్య చర్యలు చేపట్టి, మురుగనీరు పోయే విధంగా డ్రైనేజ్ ని నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుచున్నారు . జిల్లా అధికారులు ఇప్పటికీ స్పందించి మాకు విముక్తి కల్పించాలి అని గ్రామస్తులు కోరుతున్నారు.