-
-
By Chowdary
Updated :
12 November 2025 12:20 PM
కాకినాడ: విద్యాదాత శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ హైస్కూల్ కి చెందన 1998-1999 సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. కార్యక్రమం లో భాగం గా ముందుగా పూర్వ విద్యార్థులు విద్యాదాత మల్లాడికి అంజలి ఘటిస్తూ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాని ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాలలో ఉన్న వారు 26 ఏళ్ళ తరువాత ఒకరిని ఒకరు చూసుకుని భావోద్గేగానికి గురైయ్యారు. తోలుత ఉపాధ్యాయుల పాదపూజతో కార్యక్రమo నిర్వహించగా, తమకు విద్యను భోధించిన ఉపాధ్యాయులను ముష్టి ప్రకాశరావు, రవీంద్రనాధ్, తాతబ్బాయి, సుబ్బారావు, సంపత్ కుమార్, సూర్యకాంతం, ఉమాదేవి, బాలసుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, అభిలాష లను ఘనంగా సన్మానించారు. ఈ సంధర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నాటి గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్ధాయిలో ఉన్నామని తెలిపారు. సుమారు 90మంది విద్యార్థులు ఎన్నో సంవత్సరాల తరువాత కలుసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఒకరినోకరు ఆలింగనం చేసుకుంటూ పాత స్నేహితులను గుర్తుపడుతూ సరదాగా గడిపారు. ఈ కలియిక కారణమైన తమ తోటి విద్యార్ధులకు కృతజ్ఞతలు తెలిపారు.