-
-
By Chowdary
Updated :
11 November 2025 05:05 PM
అనకాపల్లి రూరల్: యువ క్రీడాకారులు సుశిక్షితులైన గురువుల వద్ద శిక్షణ పొందాలని అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ శైలజ తెలిపారు. స్థానిక జార్జి క్లబ్ కు మంగళవారం ఆమె క్లబ్ పాలకవర్గ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆమెకు క్లబ్ ప్రెసిడెంట్ బిఎస్ ఎన్ కే జోగి నాయుడు, సెక్రటరీ , విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు బుద్ధ కాశి విశ్వేశ్వరరావు (కాశి మాస్టర్) , కోశాధికారి విల్లూరి చంద్రశేఖర్, జిమ్ కోచ్ ఎమ్ ఎన్ ఎస్ అప్పారావు క్లబ్ సభ్యులు జిల్లా క్రీడా అధికారానికి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా శైలజ క్లబ్ లో ఉన్న వ్యాయామశాల, ఇండోర్ అండ్ ఔట్ డోర్ సెటిల్ కోర్టులు, ఇండోర్ గేమ్ రూమ్స్, ఆఫీస్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆమెను పాలకవర్గ సభ్యులు జోగి నాయుడు, కాశీ మాస్టర్, చంద్రశేఖర్, డాక్టర్ విష్ణుమూర్తి, జిమ్ కోచ్ ఎం ఎన్ ఎస్ అప్పారావు తదితరులు దుశ్శాలువాలతో, బొకేలు అందించి జ్ఞాపికతో సత్కరించారు.
క్లబ్ సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ
క్రీడా రంగానికి జార్జ్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా నూతన క్రీడా విధానం తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు, శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. క్రీడారంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జిల్లాలో క్రీడారంగం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే ధ్యేయంగా క్రీడాకారుల అభ్యున్నతి కోసం జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ హాస్టల్ ఏర్పాటుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తాను కూడా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి అని తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తాను ఈ స్థితికి చేరుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా జార్జ్ క్లబ్ కోచ్ వెయిట్ లిఫ్టింగ్ నేషనల్ క్రీడాకారుడు ఎంఎన్ఎస్ అప్పారావు మాట్లాడుతూ జార్జ్ క్లబ్ లో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులకు తర్ఫీదు ఇచ్చేందుకు పవర్ లిఫ్టింగ్ రబ్బర్ సెట్, అలాగే క్లబ్ లో సమ్మర్ క్యాంపులు నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ శైలజ తక్షణమే స్పందించారు. జార్జ్ క్లబ్ లో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ కోసం రబ్బర్ సెట్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సమ్మర్ క్యాంపులు కూడా ఇక్కడ నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెంటకోట సుబ్రహ్మణ్యం, దాడి బుజ్జి, ఆడారి హరి, పిల్లా శ్రీనివాస్, ఆడారి శ్రీనివాసరావు, మళ్ల లోకేష్, క్లబ్ మేనేజర్ సీతారాం,స్వామి తదితరులు పాల్గొన్నారు.