-
-
By Chowdary
Updated :
11 November 2025 05:00 PM
గూడెం / సీలేరు: కాఫీ కార్మికుల చర్చలు విఫలం సమ్మె కొనసాగింపు వివరాల్లోకి వెళితే గత నెల 10వ తేదీన కాఫీ కార్మికుల సమస్యలపై10 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సంస్థ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది, ఈరోజు 10వ తేదీన కాఫీ కార్మికులకు చర్చ లకు ఆహ్వానించడం జరిగింది, క్షేత్రస్థాయి సిబ్బంది కింద స్థాయి ఉద్యోగులను నియమించాలని 75 హెక్టార్లకు ఒక మనిషి ఎలా పనిచేస్తారని యూనియన్ ప్రతినిధులు అడగగా గత సంవత్సరం ఇదే అంశం పైన (ఆర్ ఎమ్ )సమక్షంలో జరిగిన ఒప్పందం మూడు నెలలలోపు నియమిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు నియమించకపోవడం ఏమిటని యూనియన్ ప్రతినిధులు నిర్వహించారు, ఈ అంశం ఎండి దృష్టిలో ఉందని చెపుతున్నారు తప్ప నియమించడం లేదని అన్నారు, కింద స్థాయి ఉద్యోగులను నియమించ కుండా సంస్థ పరిరక్షించడం సాధ్యం కాదని యూనియన్ నాయకులు తేల్చి చెప్పారు, అలాగే వీడిఏ కరువు బత్యం పాయింట్లకు అనుగుణంగా రోజు కూలి రేట్లు కేజీ పండ్ల రేట్లు పెంచాలని యూనియన్ ప్రతినిధులు కోరగా జీవో వచ్చాక అమలు చేస్తామని డాటవేచే ధోరణితో యాజమాన్యం మాట్లాడారని మండిపడ్డారు. పర్మినెంట్ క్వార్టర్సుల రిపేర్లు ప్రతిపదనాలు తప్ప ఎక్కడ అమలు చేసిన దాఖలు లేవని అన్నారు,సంస్థ రక్షణ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమ్మె కొనసాగిస్తున్నామని యూనియన్ ప్రతినిధులు తెలియజేశారు, ఏపీ ఎఫ్ డి సి యాజమాన్యం, కృష్ణ బాబు డివిజనల్ మేనేజర్ పాడేరు, రత్న దీపిక, చింతపల్లి, త్రిమూర్తులు రెడ్డి ఆర్వి నగర్, సత్యం, నర్సీపట్నం, పూర్వడి యం మహేష్, కాఫీ కార్మిక సంఘం సిఐటియు ప్రతినిధులు, బోనంగి చిన్నయ్య పడాల్, జిల్లా అధ్యక్షులు, ఎల్ సుందర్రావు, జి సత్యనారాయణ సిఐటియు కాఫీ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు, అధ్యక్ష కార్యదర్శులు కాఫీ కార్మిక సంఘం, రాజు, మోరి వెంకటగిరి, హెల్పర్ల సంఘం, రాజారావు, ఆర్ముగం, కనకవల్లి, కాంతమ్మ, వెంకటేష్, సింహాచలం, బాలకృష్ణ సుందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.