-
-
By Chowdary
Updated :
15 November 2025 04:14 PM
నర్సీపట్నం, నవంబర్ 14: మాకవరపాలెం తామరం నందు అరుణోదయ చిరు ధాన్యాల ప్రొడక్ట్స్ షాపును యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రారంభించడం జరిగింది. వెలుగు ఏ పి ఎం .మంగ మాట్లాడుతూ చిరుధాన్యాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, మన పెద్దలు 90 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు బ్రతికారంటే ఈ చిరు ధాన్యాలే కారణమని, రసాయనక ఎరువులు కాకుండా సేంద్రీయ ఎరువులతో పండించిన పంటను పూర్వీకులు తినేవారని, ప్రస్తుతం అందరూ ఫాస్ట్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారని, అందులో పల్లె వాసులు కూడా అలవాటు పడ్డారని ,ఈ అలవాట్లను మార్చుకుంటే ఆరోగ్యం మన సొంతమవుతుందని తెలిపారు. మాకవరపాలెం ఎఫ్ పి ఓ సీఈఓ సూరిబాబు మాట్లాడుతూ కరోనా వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలనే ఆలోచన వచ్చిందని, పాత ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలుసుకున్నప్పటికీ ఎలా ఉపయోగించాలో తెలియక సతమతమవు తున్నారని, ఈ తరుణంలో అరుణోదయ చిరుధాన్యాల ప్రొడక్ట్స్ ద్వారా చిరు ధాన్యాలతో అనేక రకాల వంటలు చేసుకునే పరిస్థితులలో లేనందువల్ల ఈ మాల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, నూటికి 20 శాతం మంది ప్రజలు ఆసుపత్రికి వెళుతున్నారని, 80 నుండి 90 శాతం ప్రజలు ఆరోగ్యంగా జీవించాలంటే ఇటువంటి చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు హరిబాబు, వెంకునాయుడు , శ్రీను, ఆడారి అరుణ తదితరులు పాల్గొన్నారు.