-
-
By Chowdary
Updated :
20 November 2025 04:27 PM
అరవిందనగర్ (అనంతపురం): మొక్కజొన్న, టమాటా, తదితర విత్తనాలను దుకాణం యజమానులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారు. రైతులు ఇలాంటి నాసిరకం విత్తనాల పొట్లాలు కొనుగోలు చేసి, ఆపై పంట దిగుబడి రాక అప్పులపాలవుతున్నారు. కొందరు వినియోగదారులను ఆకర్షించేలా నిత్యావసర సరకులను ఆకర్షణీయ పొట్లాల్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు.
చౌక ధాన్యం డిపోల డీలర్లు కొందరు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని పది కిలోలకు రెండు, మూడు కిలోలు తక్కువ తూకంతో ప్రజలకు ఇస్తున్నారు. నగరం, గుల్జార్‌పేటలో డీలరు ఒకరు తక్కువ తూకంతో బియ్యం ఇస్తున్న తీరు రెవెన్యూ అధికారుల తనిఖీలో గుర్తించి, డీలరును సస్పెండ్ చేశారు. పొట్లాల్లో సరకులు ప్యాక్ చేయడానికి తూనికలు కొలతల అధికారుల అనుమతి తీసుకోవాలి. అలాకాకుండా ఇష్టారాజ్యంగా వ్యాపారాలు సాగిస్తున్నారు.
కొనుగోలు చేసిన దానికి బిల్లు తీసుకోవాలి. తూకం చూడాలి. పొట్లంపై ధర, సరకు నాణ్యత, తయారుదారు, తేదీ, ఈ మెయిల్, ఫోన్ నంబరు, తదితర వివరాలు చూసుకోవాలి. తేడా ఉంటే సహాయ నియంత్రణ అధికారి : 984 909 5707, అనంతపురం డివిజన్ అధికారి: 984 981 6216, టోల్‌ఫ్రీ నంబరు: 1800 425 4202 నంబర్లకు ఫోన్ చేయాలని అనంతపురం డివిజన్ తూనికలు, కొలతలశాఖ తనిఖీ అధికారి ఖాజా చెబుతున్నారు.