-
-
By Chowdary
Updated :
20 November 2025 04:24 PM
ఆత్రేయపురం (మనసులో మాట )నవంబర్ 20: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో ముఖ్య అతిథులు గా వాడపల్లి వెంకటేశ్వర ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఎంపీడీవో, బి.కే.ఎస్.ఎస్. వెంకట రామన్, మండల విద్యాధికారి, పివి ప్రసాద్ రావు, ఆత్రేయపురం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు, ముదునూరి రామభద్ర రాజు, వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ వి.ప్రసాద్ రాజు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు అని పుస్తక పఠనం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఉద్యోగం సంపాదించే స్థాయి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి కి ఎదగాలని టెక్నాలజీ కొంత వరకే సాయపడుతుందని పుస్తక పటం ద్వారా సంపాదించే జ్ఞానం అన్ని విధాల ఉపయోగపడుతుందని అన్నారు. మేము గ్రంధాలయాల్లో సభ్యులుగా చేరి పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించి ఈ ఉన్నత స్థాయికి చేరామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు రామకృష్ణ, ఉపాధ్యాయులు చిప్పాడ సత్యనారాయణ. పోటీలలో గెలుపొందిన విజేతలు అందరికీ ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేశారు. గ్రంథాలయాధికారి టి. నమశివాయ మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.