-
-
By Chowdary
Updated :
20 November 2025 04:08 PM
తాళ్ళరేవు (మనసులో మాట), నవంబరు 19: పేదవాళ్ళకి వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకు వస్తె, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని, తాము చూస్తూ ఊరుకోబొమనీ ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం గాడిమొగ పంచాయితీ పరిధిలోని చినవలసల, సుంకరపాలెం గ్రామాలలో పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పొన్నాడ మాట్లాడుతూ పేదవాడికి వైద్యాన్ని దూరం చేసే కుట్రలను ప్రజలు తిప్పుకొట్టాలన్నారు. మెడికల్ కళాశాలలో ప్రభుత్వం ద్వారానే నిర్వహించాలని, కూటమి ప్రభుత్వo కళ్ళు తెరిచి ప్రైవేటీకిరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఈసీ మెంబర్ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వo వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎవరూ అధైర్యపడవద్దని అండగా ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారం లోకి వచ్చి జగన్ ముఖ్య మంత్రి అవుతారన్నారు. అలాగే నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్, కాశి బాలముని కుమారి, ఢిల్లీ నారాయణ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా పొన్నాడను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉంగరాల సంతోష్, వల్లభుని దొరబాబు, నాయకులు అంకాడి అంజిబాబు, పోతాబత్తుల నూకరాజు, రేకాడి నరసింహమూర్తి, కొక్కిలిగడ్డ లోకేష్, పేస్సింగి వీరప్రసాద్, కోపనాతి వీరబాబు, అరదాడి రమణ, పోతుల రత్నకుమారి, పందిరిపల్లి రాజేష్, పెట్ల సూర్యనారాయణ రాజు, చెక్కా కామేశ్వరరావు, కోరుకొండ కిరణ్ కుమారి, మోర్త భీమాబాయి, వెంటపల్లి నూకరాజు, దడాల జగదీశ్వరరావు, పేర్ని ఆదినారాయణ మూర్తి, కొల్లు శ్రీను, కోటికలపూడి చందు, కామాడీ భైరవమూర్తి, మట్టా లింగమూర్తి, రెడ్డి నాగేశ్వరరావు, సంగాడి శ్రీనివాసరావు, గునిపె విష్ణు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గాడి మొగ పంచాయతీ పరిధిలోని చినవలసల, పెదవలసల లక్ష్మీపతిపురం గ్రామ పెద్దలు, వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.