-
-
By Chowdary
Updated :
20 November 2025 02:47 PM
పిఠాపురం, అమరావతి న్యూస్, నవంబర్ 19: రైతులు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రైతుల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం పిఠాపురం పట్టణంలో గల అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన పియం- కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రూ 20000 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో భూమి కలిగిన రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుందని, ఈ పంట నమోదయిన తర్వాత కౌలు రైతులకు కూడా రెండు విడతలుగా పెట్టుబడి సాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాల్లో 23,105 మంది రైతులకు రెండో విడతలో రూ. 15.02 కోట్లు జమ కానున్నాయని తెలిపారు.
*ఇరు పార్టీల శ్రేణులు హోరాహోరీ నినాదాలు*
కార్యక్రమం ఆరంభంలో కార్యకర్తలంత సమన్వయంతో వ్యవహరించినప్పటికీ ముగిసే సమయంలో జన సైనికులు జై జనసేన అని తెలుగు తమ్ముళ్లు జై తెలుగుదేశం అంటూ హారాహోరీగా నినాదాలు చేసుకున్నారు. గతంలోనూ పలు వేదికలపై ఇదే తరహా నినాదాలు తీవ్రమైన పరిస్థితులకు దారితీసాయి. కూటమి పొత్తు ధర్మంలో భాగంగా ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి పరస్పరం సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ పిఠాపురం లో మాత్రం సమన్వయం కొరవడుతుంది, భవిష్యత్తులో ఈ పరిణామాలుకి ఏ పరిస్థితులకు దారితీస్తాయో అని పలువురు నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ, ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, బిజెపి పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు,పాడా ప్రాజెక్టు డైరెక్టర్ చైత్ర వర్షిని, అగ్రికల్చర్ ఏడి స్వాతి, ఏవో గంగాధర్, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.