-
-
By Chowdary
Updated :
20 November 2025 02:45 PM
కాకినాడ (మనసులో మాట) నవంబర్ 19: వీధిలో తిరిగే కుక్కలు ఆవులు కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలులో ఎటువంటి ఉదాసీనత ప్రదర్శించరాదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎనిమిరెడ్డి మాలకొండయ్య సిటిజన్స్ ఇనిషియేటివ్ కార్యదర్శి దువ్వూరి సుబ్రహ్మణ్యం, యార్లగడ్డ రామ్ కుమార్ బుధవారం కార్పొరేషన్ ఆఫీస్ లో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నీ కలిసి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా వీధి కుక్కలు కు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వారికి అందిన లేఖను మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. మాలకొండయ్య దువ్వూరి సుబ్రహ్మణ్యం యార్లగడ్డ రామ్ కుమార్ లతో మాజీ కౌన్సిలర్ జీవీఎస్ శర్మ,సెంట్రల్ మండల బిజెపి నాయకులు గోడి వెంకట్ కందాల రవి ఉన్నారు.
కాకినాడ నగరంలో కుక్కలకు శాశ్వత ఆశ్రయ గృహాలు లేనందున నగర పొలిమేరలో మూడు ఎకరాల భూమికి తక్కువ కాకుండా భూమిని సేకరించి శాశ్వత ఆశ్రయ గృహాలను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.నగరంలో 16 వేల కుక్కలు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు స్థలం అవసరమని వారు అభిప్రాయ పడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా నగరంలో కుక్కలను పట్టి శాశ్వత ఆశ్రయ గృహాలకు తరలించాలని వారు కోరారు. కుక్కలు వాటి మానసిక స్థితికి అనుగుణంగా స్వేచ్ఛగా తిరిగేలా శాశ్వత ఆశ్రయ గృహాల నిర్మాణం జరగాలని, నిర్మాణాల విషయంలో అవసరమైతే పశువైద్యల సలహా తీసుకోవాలని వారు సూచించారు.నగరంలో రోడ్లమీద తిరుగుతున్న ఆవులు వాహనాలు కారణంగా గాయాల పాలవుతున్నాయని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్ల మీదే తిరిగే ఆవులను సైతం ఆశ్రయ గృహాలకు తరలించాలని అవసరమైతే ఇందుకోసం జంతు హింస నివారణ సంఘం స్థలాన్ని తాత్కాలికంగా వినియోగించు కొని విషయాన్ని పరిశీలించాలని వారు కమిషనర్ కు సూచించారు.
సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో వీధి కుక్కలకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ క్యూఆర్ కోడ్, జిపిఎస్ లు అమర్చాలి. మున్సిపాలిటీ ప్రవేశపెట్టే ప్రతి సంవత్సర బడ్జెట్లోనూ వీధి కుక్కలు ఆవుల ఆహారానికి తగినన్ని నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.వీధి కుక్కలు ఆవులకు అందించే ఆహార విషయంలో రాజీ పడరాదని కేటాయించిన నిధులు అవినీతి లేకుండా వీటి ఆహారానికి వినియోగించాలని వారు కమిషనర్ నీ కోరారు.
షెల్టర్ హోమ్స్ లో అదే విధంగా కుక్కలకు ఏ బి సి ఆపరేషన్లు నిర్వహిస్తున్న థియేటర్లలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిరంతరం ఆ సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని ఈ బృందం కార్పొరేషన్ అధికారుల్ని డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ప్రతి వీధి కుక్కకు అనిమల్ భర్త కంట్రోల్ ఆపరేషన్ నిర్వహించాలని, అదేవిధంగా ఆశ్రయ గృహాలలో ఉంచిన కుక్కలు, ఆవులకు సంబంధించిన రికార్డులు విధిగా నిర్వహించాలని వారు కోరారు.నిర్దిష్ట కాలంలో పశు వైద్యులు ఆశ్రయ గృహాలలో ఉంచిన కుక్కలు ఆవుల ఆరోగ్య పరిస్థితులను సమీక్షించే విధంగా అవసరమైన వైద్యాన్ని అందించే విధంగా ఏర్పాటు చేయాలని వారు కమిషనర్ ని కోరారు.కుక్కలకు ఇచ్చే యాంటీ రాబిస్ ఇంజక్షన్ల యొక్క శక్తి ఒక సంవత్సర కాలమే ఉంటుందంటున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరము ప్రతి కుక్కకు యాంటీ రాబిస్ ఇంజక్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని వారు కమిషనర్ ని కోరారు.
ఆశ్రయ గృహాలలో ఉంచిన జంతువులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా కోర్టు నిర్ణయించిన గడువు అనంతరం వీధులలో కుక్కలు మరియు ఆవులు వంటి జంతువులు ఎక్కడైనా కనిపించినా మున్సిపల్ అధికారులు కోర్టుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వారు మున్సిపల్ అధికారులకు సూచించారు.