-
-
By Chowdary
Updated :
20 November 2025 02:44 PM
అనపర్తి( మనసులో మాట) నవంబరు 19: అనపర్తి మండలం రామవరంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా మాట్లాడుతూ, అనపర్తి నియోజకవర్గం పరిధిలో మెగా జాబ్ మేళాను అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ బాయ్స్ హైస్కూల్ లో నవంబర్ 23వ తేదీ ఆదివారం నిర్వహించడం జరుగుతుందని, వికాస సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతోందని, దాదాపుగా 20,000 వేకెన్సీస్ కి సంబంధించి ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతోందని అన్నారు.. ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ బాయ్స్ హైస్కూల్ లో ఈ కార్యక్రమం మొదలై, సాయంత్రం వరకు జరుగుతుంది.అదే రోజున ఆఫర్ లెటర్స్ కూడా ఎవరైతే ఎంపికైన వారున్నారో, వారందరికీ ఇవ్వటం జరుగుతుంది.
ప్రధానంగా దాదాపుగా పెద్ద పెద్ద కంపెనీలు 35 కంపెనీలు దీనిలో భాగస్వామ్యం వహిస్తా ఉన్నాయి. పీపుల్ టెక్ గాని,సదర్ ల్యాండ్ కానీ,ఇసుజి, టాటా ఎలక్ట్రానిక్స్ గాని,హోండాయ్ , అలాగే యాక్సిస్ బ్యాంకు , డెక్కన్ ఫార్మా వంటి ప్రముఖమైన కంపెనీలు దీనిలో పాటిస్పేట్ చేస్తా ఉన్నాయి . ఈరోజు నుంచి కూడా అనపర్తిలో ఏదైతే మా కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కొరత ఉన్నాను.అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ బాయ్స్ హైస్కూల్ లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది తప్పనిసరిగా అందరూ ఈ సదవకాశాన్నీ వినియోగించుకోవాలని ఏదైతే ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు కాని,లోకేష్ గాని ఎన్నికల ముందు నిరుద్యోగులకని, ఆ రోజు ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ కి అనుగుణంగా ఇవాళ అన్ని రకాలుగా ఉన్న అవకాశాలు అన్నిటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావున్నాము.
దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది. పెద్ద ఎత్తున జరిగే ఈ మెగా జాబ్ మేళాని అందరూ తమ తమ అర్హతలను బట్టి ఉద్యోగాలను సాధించుకునే దిశగా ప్రయత్నం చేస్తారని, మీ అందరి ప్రయత్నానికి మా అందరి మద్దతు ఉంటుందని, తప్పనిసరిగా అందరికీ మా సహకారంతో మీరందరూ మీ ఉద్యోగాలని సాధించాలని విజ్ఞప్తి చేసుకుంటూ, తప్పనిసరిగా నవంబర్ 23వ తేదీ ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుంచి అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ బాయ్స్ హైస్కూల్ లో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని సవినయం గా విజ్ఞప్తి చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.