-
-
By Chowdary
Updated :
20 November 2025 02:39 PM
ప్రత్తిపాడు ( మనసులోమాట) నవంబర్ 19: 58వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గెద్దనాపల్లి శాఖ గ్రంధాలయంలో బుధవారం విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించారు గ్రంథాలయాధికారి దన్నిన శంకరరావు సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ జిల్లా పరిషత్ హై స్కూలు ఉపాధ్యాయులు నూకరాజు సాయికుమార్ లోవరాజులుపాల్గొని ప్రసంగించారు విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠనం చేయాలన్నారు దిన పత్రికలు చదవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అన్నారు గ్రంథాలయ ఉద్యమ సారథులు అయ్యంకి వెంకటరామయ్య చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు వంటి ఎందరో మహాను బావుల ప్రయత్నాల వల్లే స్వాతంత్రానికి ముందు నుండి చాలా గ్రామాల్లో గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి అన్నారు ఇప్పుడు విపరీతంగా మీడియా పెరిగిపోవడం వల్ల వార్తాపత్రికలు వదిలేసి సెల్ఫోన్లు వాట్సప్ వంటి సాంకేతిక వస్తువులపై ఆధారపడటం వల్ల అది చూస్తేనే గాని ఏ విషయం తెలుసుకోలేని పరిస్థితి కి ఇప్పటి సమాజం అలవాటు పడిపోయింది అన్నారు మనం ప్రతి విషయాన్ని చదవడం నేర్చుకుంటే జీవితాంతం చదివిన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవచ్చని ఈ క్రమంలోనే నేటి విద్యార్థులు చూడడం కంటే చదవడం అలవాటు చేసుకోవాలన్నారు క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని స్థానిక హై స్కూలు పాఠశాలల విద్యార్థులు ప్రజలు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని గెద్దనాపల్లి గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయని పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ అంతా ఇక్కడ లైబ్రరీలో ఉందని గ్రంథ పాలకుడు శంకర్రావు సమరుద్దేశించి వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులతో పాటు స్థానిక పుస్తక ప్రియులు ప్రజలు పాల్గొన్నారు