-
-
By Chowdary
Updated :
20 November 2025 02:33 PM
పెద్దాపురం (మనసులో మాట) నవంబర్ 20; కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. గురువారం సామర్లకోట మండలం అచ్చంపేట కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీరుపై ఎమ్మెల్యే చినరాజప్ప మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రైతులను, వ్యవసాయ రంగాన్ని అప్పటి జగన్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వ వచ్చిన వెంటనే గత ప్రభుత్వం రైతులకు పెట్టిన ధాన్యం పులి బకాయిలను చెల్లించడమే కాకుండా, రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సొమ్ములు జమ చేయడం జరిగిందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. ప్రజల సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారధ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో, ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చిన రాజప్ప తెలిపారు. ప్రజలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం జరిగిందని కూడా ఎమ్మెల్యే చినరాజప్ప ఎద్దేవ చేశారు.