-
-
By Chowdary
Updated :
20 November 2025 02:32 PM
అమలాపురం( మనసులో మాట) నవంబరు 20: రానున్న రబీ సీజన్లో సాగునీటి పర్యవేక్షణకు, సాగు నీరు సమయానికి సరఫరా చేయ డానికి గత అనుభవాలను దృష్ట్యా రబీ సీజన్లో నీటి ఎద్దడి సమ స్యలను ఎదుర్కొన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సాగునీటిని అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ బోర్డు సభ్యులకు విన్నవించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు కోనసీమ జిల్లాలో 2025- 26 రబీ సాగులో నీటి సరఫరాకు సంబంధించి ఇరిగేషన్ సలహా బోర్డు సమావేశం జిల్లా కలెక్టర్ అధ్య క్షతన ప్రజా ప్రతినిధులు నీటి సంఘాల సభ్యుల సమక్షంలో నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా తూర్పు మధ్య పశ్చిమ డెల్టాలకు సంబంధించి 8,96,507 ఎకరాల లో సాగుకు గాను 93.22 టీఎంసీల నీటి లభ్యత అవసరమన్నారు. ఈ స్థాయిలో నీటి సరఫరా కి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. గోదావరి నదిలో ప్రవాహం ద్వారా 9 టీఎంసీలు సీలేరు నుండి 44 టీఎంసీలు పోల వరం ప్రాజెక్టు నీటి నిలవ నుండి 20 టిఎంసిలు సీలేరు బైపాస్ అనుమతితో 20 టీఎంసీలు, వెరసి 93 టీఎంసీలు సేకరించినట్లు తెలిపారు.ఫసలీ 1435 అభివృద్ధి, సాగునీటి సరఫరా విధానాలు, నీటి పంపిణీ సమయం మరియు ప్రాధాన్యతలను సభ్యుల అనుమతితో సమీక్షించారు. జిల్లాలో కాలువలు క్లోజర్ సమయంలో చేపట్టాల్సిన పనుల కార్యాచరణను సిద్ధం చేసి సకాలంలో పనులు చేపట్టాలని ఆదేశించారు. రబీ సీజన్లో నీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నమయ్యే చిట్టచివరీ ఆయకట్టుకు ప్రాధాన్యత నివ్వాలని ఆదేశించారు. వారాబంది విధానాన్ని కాలువ చివరి ఆయకట్టు నుండి పై స్థాయి వరకు అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు సూచించిన విధంగా కాలువలో జంగిల్ క్లియ రెన్స్ పూడికతీత పనులకు మరియు షట్టర్ గేట్లు మరమ్మత్తు పనులకు ప్రాముఖ్య తనివ్వాలన్నారు .53 కోట్ల తో ప్రతిపాదించిన 400 పనులను సకాలంలో చేపట్టి పూర్తి చేయాలన్నారు. లస్కర్లు నియమాకం జల వనరుల శాఖ ఇంజనీర్లతో సాగునీటి పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఎక్కడా నీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా పటి ష్టమైన చర్యలు తీసుకో వాలన్నారు. 2026 ఏప్రిల్ 15 తేదీ వరకు రబీ సీజన్ కు సాగునీటి సరఫరా ఉంటుందని జూన్ 1 నుండి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుందన్నారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ గోదావరి సీలేరు డెడ్ స్టోరేజ్ వాటర్ స్థాయిలను మరలా పునః పరిశీలించాలని కో రారు, లేని పక్షంలో సాగు నీటి ఎద్దడి సమస్యలు పునరావృతం అవుతా యని సూచించారు. రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా రబీ సీజన్లో అందజేయాలన్నారు. ఎమ్మెల్సీ పేరావత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ క్లోజర్ పనులు నిర్దేశిత కాల వ్యవధిలో చేపడుతూ ఆ యొక్క పనుల ఉపయోగాలు చిట్ట చివరి రైతు వరకు చేరేలా కృషి చేయాలన్నారు. హడావిడిగా పనులు చేయటం వల్ల ఆశించిన ప్రయోజనాలు దక్కవని సూచించారు. ప్రభుత్వ విప్పు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కోనసీమ జిల్లా ఆటు పోట్లు సంబంధించిన ప్రాంతమని పం టలు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత బోర్డు సభ్యు లందరిపై ఉందన్నారు .ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రసంగిస్తూ జలవనురుల శాఖ ఉన్న వనరులను సమర్థవం తంగా వినియోగం లోనికి తెస్తే రైతాంగానికి మేలు చే కూరుతుందన్నారు. ఖరీఫ్ పంటలు మునిగిపోకుండా రబీ సీజన్ పంటలు ఎండి పోకుండా ఉండేందుకు డెల్టా ఆధునీకరణ పనులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సూ చిం చారు. తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు సునీల్ కుమార్ ప్రసంగిస్తూ శిథి లావస్థకు చేరిన 9 లాక్ లను ఆధునికరించాలని లస్కర్లు సిబ్బంది క్వార్టర్లలో కనీస వసతులు కల్పించా లన్నారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రసంగిస్తూ లస్కర్ల వేతనాలు పెంచివారికి నెల నెల జీతంఅందేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సెంట్రల్ డెల్టా అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్ మాట్లా డుతూ క్రాస్ బండ్లు వేసేందుకు నిధులు కేటా యించాలని వారా బందీ విధానం పక్కాగా నిర్వ హించాలని కోరారు. అలాగే గోదావరి బ్యారేజీ నుంచి రైతులకు తగిన మోతాదు లో సాగునీటి అందుబాటు కు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేకంగా తక్కువ నీటి ప్రాంతాలలో నీటి సరఫరా పెంచేందుకు ఆధునిక నీరు పంపిణీ పద్ధతులు, క్రాస్ బండ్ల ద్వారా నీరు అందించడం మొదలైన చర్యలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విధానాలు రబీ 2025-26 పంట సీజన్ కోసం సాగునీటి సరఫరా నియంత్రణకు అనుగుణం ఉండాలని బోర్డు సభ్యులు తీర్మానించారు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు
ప్రసంగిస్తూ రబీ సీజన్లో సాగునీటి నిల్వలు, నీటి వసతులను సమగ్రంగా పర్యవేక్షిస్తూ సాగునీటి పంపిణీ ఆయకట్టు అంతటికీ సమగ్రంగా అందించాలన్నారు
గోదావరి బ్యారేజీ నుంచి సరైన నీటి విడుదలతో రబీ పంటల నీటి అవసరాలు నెరవేర్చాలన్నారు. అదేవిధంగా మురుగ కాలువలలో క్రాస్ బండ్లు వేసి తగిన మోతాదులో నీటిని సరఫరా చేయడం మరియు, ఆధునిక ఇరిగేషన్ పద్ధతులను ఉపయోగించి నీటి సద్వినియోగంచేయాలన్నారు.. ఈ కార్యక్ర మంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి డిఆర్ఓ కే మాధవి జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు జలవనుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కే గోపినాథ్, నీటి వినియోగ దారుల సంఘాల ప్రతినిధులు రైతులు పాల్గొ న్నారు.