-
-
By Chowdary
Updated :
14 November 2025 11:34 AM
గొల్లప్రోలు, నవంబరు 13: గొల్లప్రోలు మండల పరిధి చిన్న జగ్గంపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన మొగిలి అప్పారావుకు బుధవారం గ్రామస్తులు ఘన సన్మానం అందించారు. పూలమాలలు, శాలువాలతో గ్రామ పెద్దలు, యువకులు, మహిళాలు పెద్ద ఎత్తున కలిసి ఆయనను ఆత్మీయంగా సత్కరించి తమ అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మొగిలి అప్పారావు మాట్లాడుతూ...
ఇంత గౌరవమైన పదవిని నాపై నమ్మకంతో అప్పగించిన కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ బాధ్యత నా గ్రామం, నా నియోజకవర్గం మాత్రమే కాదు, మొత్తం సగర కమ్యూనిటీ అభివృద్ధికి అంకితం చేయడానికి అవకాశం లభించిందని,ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానుఅని తెలిపారు.అలాగే తమ నియామకానికి తోడ్పడిన నాయకులు, సంఘాల ప్రతినిధులు, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరి అభిలాషలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని, సగర సమాజ అభివృద్ధికి ప్రత్యేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, యువతకు శిక్షణ అవకాశాలు, మహిళల సాధికారత వంటి అంశాలలో త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభిస్తాం అని తెలిపారు.
గ్రామస్తులు మాట్లాడుతూ...
మొగిలి అప్పారావు వంటి సేవాభావం ఉన్న వ్యక్తి డైరెక్టర్గా నియమితులవడం తమ గ్రామానికి గొప్ప గౌరవమని, సగర కమ్యూనిటీ అభివృద్ధికి ఇది ఎంతో ప్రయోజనకరమని ఆనందం వ్యక్తం చేశారు.ఈ సత్కార కార్యక్రమంలో జనసేన నాయకులు, , కూటమి నాయకులు, గ్రామ యువత, గ్రామ పెద్దలు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు