-
-
By Chowdary
Updated :
14 November 2025 11:31 AM
పిఠాపురం, నవంబరు 13 : విశాఖపట్నంలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మె 2025లో పిఠాపురం నియోజకవర్గానికి పెట్టుబడులును ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుంచి జనసేన నాయకుడు, గోదావరి తూర్పు ప్రాంత డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నవంబర్ 14,15వ తేదీలలో విశాఖపట్నం లో పార్ట్నర్షిప్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో దేశ,విదేశీ పారిశ్రామికవేత్తలు పెట్టుబడుదారులు పాల్గొనున్నారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం లో పెట్టుబడలకి ఉన్న అపార అవకాశాలను అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వివరించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పర్యాటక అభివృద్ధి, సముద్ర తీర ప్రాంతంలో పెట్టుబడులు, ఎగుమతులు దిగుమతులు,పోర్టు సౌకర్యాలు చేనేత వస్త్రాలు, సీ ఫుడ్ పిఠాపురంలో గల ప్రసిద్ధ దేవాలయాల పర్యాటక అభివృద్ధి, ఈ కార్యక్రమంలో సమ్మిట్ లో వివిధ విభాగాలకు చెందిన కంపెనీలు ప్రతినిధులతో సమావేశమై పిఠాపురం ప్రత్యేకతలను వివరించి పెట్టుబడులకు గల మార్గాలన్నింటిని అంతర్జాతీయ జాతీయ వ్యాపారస్తులకు వివరిస్తానని తెలిపారు