-
-
By Chowdary
Updated :
21 November 2025 12:11 PM
మహబూబ్నగర్ మండలంలో ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కళాశాలకు ఆర్టీసీ బస్సుల్లో వస్తోంది. కొందరు ఆకతాయులు నిత్యం బ్యాడ్టచ్ చేస్తున్నారని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఆర్టీసీ బస్టాండులో నా మాదిరిగా చాలా మంది బాలికలు ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో పాఠశాలలు, కళాశాలలకు వస్తున్నారు. పోకిరీలపై పోలీసు శాఖ దృష్టి పెట్టాలి’ అని కన్నీటిపర్యంతమైంది.
హన్వాడ మండలంలోని ఓ తండాకు చెందిన బాలికకు తల్లిదండ్రులు లేరు. సొంత ఇల్లు కూడా లేకపోవడంతో తమ్ముడు వాళ్ల బంధువుల ఇంట్లో నివసిస్తున్నాడు. తానేమో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటోంది. ‘సెలవుల్లో ఊరికెళ్తే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. అందరూ అదోలా చూస్తుంటారు.. మేము ఉండటానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి’ అని వేడుకుంది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, బాలికల పాఠశాలలో కలిపి 2,150 మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ ఇక్కడ మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు బాలికలు లిజన్ టూ చిల్డ్రన్ కార్యక్రమంలో గోడు వెళ్లబోసుకున్నారు.