-
-
By Chowdary
Updated :
21 November 2025 12:01 PM
తల్లిదండ్రులు పిల్లలనే లోకంగా భావించి వాళ్లు భవిష్యత్లో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. పగలు, రాత్రి కష్టపడి సంపాదించి రూ.వేలకు వేలు చదువుల కోసం ఖర్చు పెడుతుంటారు. వారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే కోరికతో పిల్లలను ఒత్తిడికి గురిచేస్తుంటారు. ప్రశాంతంగా చదువుకునేలా.. కొంత సమయం ఆడుకునేలా ప్రోత్సహించాలి.
మణుగూరులో ఓ విద్యార్థిని వారి తల్లిదండ్రులు పాఠశాల నుంచి రాగానే రోజూ ఓ గదిలో కూర్చోబెట్టి హోంవర్క్ చేయమనేవారు. అది పూర్తయ్యాక చదవమనడంతో పాటు క్లాసులో ఫస్ట్ రావాలని బలవంతం చేసేవారు. కొన్ని రోజుల తర్వాత అతడు పాఠశాల నుంచి రాగానే గదిలోకి వెళ్లి పుస్తకాలు ముందేసుకుని గంటలకొద్దీ చదివేవాడు. తోటి స్నేహితుల్లాగా ఆడుకోవడం, తల్లిదండ్రులతో మాట్లాడటం మర్చిపోయాడు. తల్లిదండ్రుల ఒత్తిడి మూలంగానే ఇలా అయ్యాడని మానసిక వైద్యులు తేల్చారు.
కొత్తగూడెంలోని ఓ బాలుడు పాఠశాల నుంచి వచ్చాక బయటకు వెళ్లి స్నేహితులతో కలిసి ఆడుకునేవాడు. ఇంటికి వచ్చి హోం వర్క్ చేసుకుని, కొద్దిసేపు చదువుకొనేవాడు. తండ్రితో కలిసి బయటికి, స్నేహితుల ఇళ్లకు వెళ్లడం చేస్తుండేవాడు. తరగతి గదిలో ఉల్లాసంగా ఉంటూ చదువులో ముందుండేవాడు. తల్లిదండ్రులు స్వేచ్ఛగా ఉంచడంతో బాలుడు ఎదిగాడు.