-
-
By Chowdary
Updated :
21 November 2025 11:58 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఓటరు జాబితా పునర్ ముద్రణకు ప్రకటన బుధవారం వెలువడింది.
సెప్టెంబర్లో మొదటిసారి..
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాలపై అభ్యంతరాల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగస్టు 26న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది జులై 1న రూపొందించిన ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని వార్డుల వారీగా ముసాయిదా జాబితాలను అధికారులు ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించారు. వాటిపై అభ్యంతరాలు స్వీకరించారు. అప్పట్లో ఖమ్మం జిల్లాలో 2,307, భద్రాద్రి జిల్లాలో 1,028 అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది జాబితాలు ప్రకటించారు. ఆ తరువాత హైకోర్టు తీర్పుతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు మరోసారి
తాజాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. ఫొటో ఓటరు జాబితా పునర్ ముద్రణకు ప్రకటనను బుధవారం జారీ చేసింది. ఫొటో ఓటరు జాబితాలను అధికారులు పునఃపరిశీలించి మిస్ మ్యాపింగ్, తదితరాలను పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సరిచేయాలి.