-
-
By LALAM NARESH
Updated :
21 November 2025 11:45 AM
న్యూస్‌టుడే, చేగుంట, దోమ, వికారాబాద్ కలెక్టరేట్, సంగారెడ్డి మున్సిపాలిటీ, నారాయణఖేడ్: క్రీడల్లో గెలవడానికి కష్టపడి సాధన చేస్తుంటారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు వెళ్లి పతకాలు సైతం తెస్తుంటారు. వేల మంది విద్యార్థులు ఆటలపై ఇష్టంతో ముందడుగు వేస్తే చివరికి రాష్ట్ర, జాతీయ స్థాయికి వచ్చేసరికి వేళ్లమీద లెక్కబెట్టేవిధంగా ఉంటోంది. ప్రధాన కారణం.. ఆట సాధన చేసేందుకు అవసరమైన పరికరాలు మాత్రం లేవు. ఒక జిల్లాలో సాఫ్ట్‌బాల్ క్రీడాకారుడే మిగతా అన్ని ఆటలకు శిక్షకుడిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్జీఎఫ్లో వివిధ ఆటల్లో అండర్-14, 17, 19 బాలబాలికల విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నారు. పీడీలు, పీఈటీలు శిక్షణ పొందినప్పుడు కొన్ని క్రీడలు తెలియవు. తల్లిదండ్రులే సొంతంగా ఖర్చు పెట్టుకుంటూ పిల్లలకు నేర్పించడం వల్లనే ఈమాత్రమైనా పతకాలు వస్తున్నాయి. ఫెన్సింగ్‌లో కత్తి, సైక్లింగ్‌లో సైకిల్ ఖరీదు ఎక్కువ. శిరస్త్రాణం, భద్రత పరికరాలు కొనాలంటే డబ్బులు సరిపోవు.2023లో క్రీడా ప్రాంగణాల్లో 16 రకాల క్రీడా సామగ్రి ఇస్తే అవి మొత్తం ఎవరింటికి చేరాయో అతీగతీ లేదు.
వికారాబాద్ జిల్లాలోని 594 గ్రామపంచాయతీలు, 232 కళాశాలలు, యువజన సంఘాలు, పాఠశాలలకు రెండేళ్ల క్రితం క్రీడా కిట్లు ఇచ్చారు. వాలీబాల్లు, క్రికెట్వి, రింగులు, ఫుట్బాల్లు పాడయ్యాయి. బంతులు పగిలిపోయాయి. పాఠశాలలకు ఏడాది క్రితం రూ.25 వేలు మంజూరయ్యాయి. ఒకటే బంతి ఇచ్చి సరిపుచ్చారు.