-
-
By Chowdary
Updated :
21 November 2025 10:13 AM
మంగపేట, న్యూస్టుడే: ఓ ఇంట్లో జరిగిన గుప్త నిధుల తవ్వకాల్లో పెద్ద ఎత్తున బంగారు నాణేలు లభించినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది గురువారం ములుగు జిల్లాలో కలకలం రేపింది. మంగపేట మండలానికి చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలోని ఇంట్లో తవ్వకాలు చేసి బంగారు నాణేలు వెలికి తీసినట్లు ఓ వీడియో వైరల్గా మారింది. తవ్వకంలో పాల్గొన్నవారితో పాటు వెళ్లిన వారికి వాటా ఇవ్వకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విషయం పోలీసులకు తెలియడంతో ములుగు జిల్లా ఎస్పీ డా.శబరీష్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మంగపేట ఎస్ఐ టీవీఆర్ సూరిని ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల మహారాష్ట్రలోని సిరోంచకు వెళ్లిన మాట వాస్తవమేనన్నారు. అక్కడి ఓ ఇంట్లోని వారికి తరచూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతండడంతో కోమటిపల్లి గ్రామానికి చెందిన వారిని పిలిపించారని, ఈ సందర్భంగా ఏవోపూజలు చేసి ఇంట్లో గొయ్యి తీయించినట్లు తెలిసిందన్నారు. అయితే అందులో గుప్త నిధులు లభించాయో లేదో స్పష్టంగా తెలియడం లేదని, విచారణ చేస్తున్నామని తెలిపారు.