-
-
By Chowdary
Updated :
20 November 2025 11:53 AM
The Great Pre-Wedding Show Movie Review || చిత్రం: ది గ్రేట్ ప్రి-వెడ్డింగ్ షో; నటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ వినయ్, ప్రభావతి, మాధవి, జోగారావు; రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్; విడుదల: 07-11-2025
ఎలాంటి హంగులు లేకుండా చిన్న చిన్న కథలు పరిమిత వ్యయంతో తెరకెక్కుతూ ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. అలాంటి చిత్రమే ‘ది గ్రేట్ ప్రి-వెడ్డింగ్ షో’. మరి దీని కథేంటి? ఎలాంటి వినోదాన్ని పంచింది?
కథేంటంటే...
పల్లెటూరే అయినా ప్రి-వెడ్డింగ్ షూట్ చేయడంలో ఆరితేరిన ఫొటోగ్రాఫర్ రమేష్ (తిరువీర్). ఊళ్లో ఫొటోస్టూడియో, జిరాక్స్ సెంటర్‌ని కలిపి నిర్వహిస్తుంటాడు. స్టూడియోకి ఎదురుగానే పంచాయతీ కార్యాలయంలో పనిచేసే హేమ (టీనా శ్రావ్య)ని ఇష్టపడుతంటాడు. ఆమెకీ రమేశ్ అంటే ఇష్టమే. ఈ ప్రేమ ప్రయాణం సాగుతుండగానే... రమేశ్ దగ్గరకు ప్రి-వెడ్డింగ్ షూట్ కోసమని వస్తాడు ఆనంద్ (నరేంద్ర రవి). రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడు ఆనంద్. మండలంలోనే బెస్ట్ ఫొటో షూట్ తనదే కావాలని, రూ.లక్షన్నరకి బేరం కుదుర్చుకుని ఫొటో షూట్ చేయించుకుంటాడు. అందుకోసం రెండు రోజులు సమయం కేటాయిస్తాడు. అంతా అయ్యాక ఫొటో షూట్ మెమరీ చిప్‌ని తన దగ్గర పనిచేసే సహాయకుడు రామ్ చరణ్ అలియాస్ రాము (మాస్టర్ రోహన్‌రాయ్) చేతికి ఇస్తాడు. జాగ్రత్త లేని ఆ కుర్రాడేమో దాన్నెక్కడో పడేస్తాడు. (pre wedding show movie review) దాంతో రమేశ్‌కి కష్టాలు మొదలవుతాయి. చిప్ లేదన్న విషయం ఆనంద్కి తెలిస్తే ఏమవుతుందోననే భయం రమేశ్‌ని వెంటాడుతుంది. మరి ఆ గండం నుంచి అతను ఎలా గట్టెక్కాడు?హేమ ఎలా సాయం చేసింది? చివరికి మెమొరీ చిప్ దొరికిందా? అన్నది చిత్ర కథ.