-
-
By Chowdary
Updated :
20 November 2025 11:34 AM
హైదరాబాద్: ‘వారణాసి’లో మహేశ్‌బాబు (Mahesh Babu) రాముడిగా నవ రసాలు అద్భుతంగా పలికించారని, ఇందులో ఓ కొత్త మహేశ్‌ను చూస్తారని అన్నారు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli). ఆయన దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ప్రియాంక చోప్రా జోన్స్ కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో (Ramoji Film City) ఈ మూవీ టైటిల్, స్పెషల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడారు.
‘‘నేను ప్రతి సినిమాని ప్రారంభించే ముందు ప్రెస్‌మీట్ పెట్టి ఆ సినిమాకు సంబంధించిన విశేషాలు చెబుతాను. అయితే, అన్నింటికీ చెప్పలేదు. ఆ కథకు ఉన్న ప్రాధాన్యం బట్టి అది జరుగుతుంది. ‘బాహుబలి’ ముందు ఏమీ చెప్పలేదు. ఈ మూవీ గురించి అలా మాటల్లో చెప్పలేం. అందుకనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమాపై ప్రేక్షకుడి అంచనాలను అందుకోవాలి. అదే సమయంలో కథావస్తువును కూడా తెలియజేయాలి. అలా ఒక మాట చెప్పకుండా వీడియో చేద్దామని అనుకున్నాం. సినిమా ప్రారంభించినప్పుడే మార్చిలో ఈవెంట్ నిర్వహించి విడుదల చేద్దామని భావించాం కానీ కుదరలేదు. జూన్, జులై నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి.ఎట్టకేలకు నవంబరు 15న మీ ముందుకు ఈ వీడియోను తీసుకొచ్చాం’’
‘‘చిన్నప్పుడు కృష్ణగారి గొప్పదనం నాకు తెలియదు. ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలే చూసేవాడిని. సినిమాల్లోకి వచ్చిన తర్వాతే కృష్ణగారంటే ఏంటో అర్థమైంది. ఇండస్ట్రీలో చాలా వరకూ కొత్త టెక్నాలజీ ఆయన సినిమాల ద్వారానే పరిచయమైంది. మనం తీసే సినిమాలన్నీ స్కోప్‌లో తీసి, ఐమ్యాక్స్ ఫార్మాట్‌కు బ్లో అప్ చేస్తాం. అది నిజమైన ఐమ్యాక్స్ కాదు. ఇప్పుడు ఈ మూవీని అసలైన ఐమ్యాక్స్ ఫార్మాట్లో మీ ముందుకు తీసుకొస్తాం. ఈ ఈవెంట్ కోసం మా టీమ్ అంతా ఎంతో కష్టపడింది. మేము విడుదల చేసే వీడియో చూసి, ప్రేక్షకుడు థ్రిల్ ఫీలవ్వాలని అనుకున్నాం. మా వీడియో టెస్ట్ చేయడానికి ప్లే చేస్తే, కొందరు డ్రోన్ విజువల్స్‌ను తీసి, నెట్లో పెట్టారు. ఇది కోట్ల రూపాయల ఖర్చు. ఎంతో మంది శ్రమ. ఈసారి రిస్క్ తీసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా చేశారు’’